ఒక్క తెలుగు సినిమా స్థాయినే కాకుండా మొత్తం భారతీయ సినిమా రూపు రేఖలనే మార్చేసిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “బాహుబలి” సినిమానే అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ చిత్రం ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా రీరిలీజ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తుండగా ఆ మధ్య నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి రీరిలీజ్ ఈ ఏడాది అక్టోబర్ లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇక రేపు జూలై 10తో బాహుబలి సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతుంది.
దీనితో చిత్ర యూనిట్ ఇప్పుడే మంచి హింట్స్ రీరిలీజ్ పై ఇస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ రేపే వస్తున్నట్టుగా వినిపిస్తుంది. బాహుబలి వస్తున్నాడు అంటూ నేటి నుంచే అలర్ట్ చేస్తుండగా ఫైనల్ గా సినిమా మళ్ళీ రికార్డు వసూళ్లు నమోదు చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
Re release???
???????????????????????????? 🙂#బాహుబలివస్తున్నాడు #Baahubali https://t.co/x95SCpc5J6
— Baahubali (@BaahubaliMovie) July 9, 2025