కింగ్డమ్’కు అంత సమయం సరిపోతుందా..?

కింగ్డమ్’కు అంత సమయం సరిపోతుందా..?

Published on Jul 6, 2025 9:00 AM IST

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఇప్పటికే వాయిదా పడుతూ ఉండటం తో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమాను జూలై 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా రావడం దాదాపు ఖాయం. దానికంటే ఒక్క రోజు ముందు ‘హరిహర వీరమల్లు’ చిత్రం వస్తుండటంతో ‘కింగ్డమ్’ వాయిదా ఖాయంగా మారింది. అయితే, నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడనే విషయంపై కూడా ఇప్పుడొక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జూలై 31న రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 14న రెండు భారీ చిత్రాల రిలీజ్ ఉండటంతో తమకు రెండు వారాల సమయం దొరుకుతుందని నిర్మాత నాగవంశీ భావిస్తున్నాడు. ఈ సమయం తమ సినిమాకు సరిపోతుందని.. ఆ తర్వాత ‘వార్-2’పై ఫోకస్ పెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ‘కింగ్డమ్’ చిత్ర రిలీజ్ డేట్‌ను జూలై 31న ఫిక్స్ చేస్తారా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు