విడుదల తేదీ : జూన్ 27, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : విజయ్ ఆంటోని, అజయ్ ధిషాన్, దీప్షిక, సముధ్రఖని, మహానది శంకర్, బ్రిగిడ సాగ తదితరులు
దర్శకుడు : లియో జాన్ పాల్
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : ఎస్. యువ
ఎడిటర్ : లియో జాన్ పాల్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘మార్గన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
హైదరాబాద్‌లో జరుగుతున్న వరుస హత్యల గురించి తెలుసుకున్న ఏడీజీపి ధృవ(విజయ్ ఆంటోని) ఈ హత్యల వెనకాల ఉంది ఎవరనేది కనుక్కునేందుకు వస్తాడు. ఈ క్రమంలో అతని ఇన్వెస్టగేషన్లో అరవింద్(అజయ్ ధిషాన్)ను హంతకుడిగా అనుమానిస్తాడు. అతడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ధృవకు పలు కీలక విషయాలు తెలుస్తాయి. ఇంతకీ అరవింద్ చెప్పిన నిజాలు ఏమిటి..? ధృవ అరవింద్‌కు సంబంధించి ఎలాంటి విషయాలను తెలుసుకుంటాడు..? అసలు వరుస హత్యలు చేస్తున్న నిందితులు ఎవరు..? వారు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు..? ఇంతకీ ధృవ ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలకు బలంగా ఉండే కోర్ పాయింట్ ఈ సినిమాలో చాలా సరికొత్తగా ప్రెజెంట్ చేశారు. దానికి తోడు ఈ సినిమాలో అజయ్ ధిషాన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అతడి పాత్రలోని వేరియేషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
ఇక విజయ్ ఆంటోని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో అతడి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అసలు ఇలాంటి లుక్‌లో అతడు ఎందుకు ఉన్నాడా.. అనేది ఫస్టాప్ మొత్తం రివీల్ చేయకుండా సస్పెన్స్‌ను క్యారీ చేసిన విధానం బాగుంది.
అటు ఎమోషనల్ పరంగా ఈ సినిమాలో తండ్రి-కూతురు, అన్నా-చెల్లి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ మూవీ సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా ఉండటం చాలా ఉపయోగపడింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
విజయ్ ఆంటోని ఈ సినిమాలో సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేసినా కూడా ఆయన పాత్రను ఇంకా బలంగా డిజైన్ చేసి ఉండాల్సింది అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఆయన పాత్ర వేస్ట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ వరకు ఆయన పాత్ర ఓకే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో సముద్రఖని పాత్ర కూడా పూర్తిగా వేస్ట్ అయింది.
అజయ్ ధిషన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను కూడా సరిగా వాడుకోలేదని సెకండాఫ్ చూస్తే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే లవ్ ట్రాక్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. సెకండాఫ్‌లోనూ కొన్ని ల్యాగ్ సీన్స్ ప్రేక్షకులను విసిగిస్తాయి.
ఇక క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే తీరు బాగున్నా, ముగింపు మాత్రం చప్పగా సాగుతుంది. విలన్‌కు సంబంధించిన మోటో ఇంకా బెటర్‌గా రాసుకోవాల్సింది. సీరియస్ నోట్లో సాగే ఈ సినిమాలో కాస్త ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు లియో జాన్ పాల్ రాసుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ, దానిని ట్రీట్ చేసిన విధానం చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా అజయ్ ధిషన్ పాత్రకు ఉన్న ప్రత్యేకతను ఆయన డీల్ చేసిన తీరు ఆకట్టుకున్నా, దాన్ని చివరికి ఒక సాధారణ ముగింపు ఇచ్చిన తీరు ఆకట్టుకోదు. ఎడిటింగ్ కూడా ఆయనే చేయడంతో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక విజయ్ ఆంటోని సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. వీఎఫ్ఎక్స్ వర్క్‌కు మంచి మార్కులు పడ్డాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
మొత్తానికి ‘మార్గన్’ చిత్రం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కథలో సరికొత్త పాయింట్ ఉన్నా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక బోరింగ్‌గా సాగే ఫస్టాఫ్, కొంతవరకు ఓకే అనిపించే సెకండాఫ్‌తో ఇదొక రొటీన్ టెంప్లేట్‌గా మిగిలింది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team