కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా రీసెంట్ గా నటించిన చిత్రమే “రెట్రో”. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి వరుసగా 45, 46 చిత్రాలు ఓకే చేయడం వంటిని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ చిత్రాల్లో తన కెరీర్ 45వ చిత్రాన్ని దర్శకుడు ఆర్ జె బాలాజీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కి డేట్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ ని రేపు జూన్ 20న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
దీనిపై ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా మంచి పవర్ఫుల్ గా కనిపిస్తుంది. మరి రేపు వచ్చే ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఏ ఆర్ ప్రకాష్ బాబు అలాగే ఎస్ ఆర్ ప్రభులు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటే సూర్య మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కలయికలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.