టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల కలయికలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘కుబేర’. రీసెంట్ గా ట్రైలర్ మరింత పాజిటివ్ బజ్ ని అందుకున్న ఈ సినిమా యూ ఎస్ మార్కెట్ లో గ్రాండ్ ప్రీమియర్స్ కి పాన్ ఇండియా భాషల్లో రెడీ అవుతుంది. ఈ కంటెంట్ పై లేటెస్ట్ గా యూఎస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమా తెలుగు, తమిళ్ కంటెంట్ మాత్రమే ముందు అందింది అని దీనితో అక్కడ 19 నుంచే ప్రీమియర్స్ ఉంటాయని ఖరారు చేశారు. కానీ హిందీ కంటెంట్ మాత్రం ఆలస్యం అయ్యిందట. దీనితో హిందీ వెర్షన్ కి ఎలాంటి ప్రీమియర్స్ ఉండవని తెలుస్తుంది. సో అక్కడ సినిమా రిలీజ్ రోజు అంటే జూన్ 20 నుంచే హిందీ షోస్ మొదలు కానున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి అలాగే అమిగోస్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.