‘కుబేర’ మూడో పాటకు డేట్ ఫిక్స్ !

‘కుబేర’ మూడో పాటకు డేట్ ఫిక్స్ !

Published on Jun 9, 2025 3:10 PM IST

ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కుబేర’. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా ఈ సినిమా మూడో సింగిల్ ‘పిప్పీ పిప్పీ దమ్ దమ్ దమ్’ సాంగ్ రేపు జూన్ 10న విడుదల అవుతుందని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఐతే, పాట విడుదల సమయం మాత్రం ఇంకా ప్రకటించలేదు.

కాగా ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర ఆడియోపై కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్ నారంగ్ మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు