లారెన్స్ ‘బెంజ్’ లోకి ‘భీమ్లా’ నటి?

లారెన్స్ ‘బెంజ్’ లోకి ‘భీమ్లా’ నటి?

Published on May 30, 2025 1:15 AM IST

పలు రంగాల్లో మంచి టాలెంట్ కలిగిన స్టార్స్ లో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. మరి లారెన్స్ హీరోగా, దర్శకునిగా అలాగే సంగీత దర్శకునిగా ఇంకా డాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాలు చేసిన తాను లేటెస్ట్ గా చేస్తున్న సాలిడ్ చిత్రమే “బెంజ్”. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న నాలుగో సినిమాగా తన కథతో దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. తెలుగులో భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అక్కడ నుంచి మంచి సినిమాలు చేస్తూనే బిజీగా ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్టుగా కోలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు