కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘సింగిల్’ మే 9న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. దర్శకుడు కార్తీక్ రాజ్ తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ మూవీలో అందాల భామలు కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఓవర్సీస్లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుంది. ఈ చిత్రం ప్రీమియర్స్, తొలి రోజు కలెక్షన్స్ ఏకంగా 178K డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. శ్రీ విష్ణు కెరీర్లో యూఎస్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ సినిమాకు ఈ వీకెండ్ మరింత కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.