కన్ఫర్మ్: ‘రాబిన్‌హుడ్’తో డేవిడ్ వార్నర్ ఎంట్రీ..!

కన్ఫర్మ్: ‘రాబిన్‌హుడ్’తో డేవిడ్ వార్నర్ ఎంట్రీ..!

Published on Mar 3, 2025 9:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘రాబిన్‌హుడ్’ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో నితిన్ స్టైలిష్ లుక్‌తో నటిస్తుండగా వెంకీ కుడుముల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ కాంబోలో మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ కేమియోపై నిర్మాత రవి శంకర్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ‘రాబిన్‌హుడ్’ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో ఆయన ఇండియన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని రవిశంకర్ తెలిపారు. ఈ సినిమాలోని ఆయన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు.

ఈ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల్లో, డేవిడ్ వార్నర్ అభిమానుల్లో ఈ సినిమాపై క్రేజ్ మరింత బలపడింది. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు