గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 16వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా.. పూర్తి స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ ఢిల్లీకి పయనం కానుంది.
ఇప్పటికే ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ ఢిల్లీలో జరగనుందనే విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీలోని ఐకానిక్ లొకేషన్స్‌లో ఈ షెడ్యూల్ షూట్ చేయనున్నారు. పార్లమెంట్, జామా మస్జిద్ వంటి ఐకానిక్ ప్రదేశాల్లో ఈ షూట్ జరిపేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే దీని కోసం కావాల్సిన పర్మిషన్ కూడా లభించిందట. ఇక ఈ ఐకానిక్ ప్లేసెస్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.