ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ప్రస్తుతం ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో వర్క్ చేస్తున్నారు. ఐతే, ఈ పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కోసం ఓ ప్రత్యేక పాత్రను డిజైన్ చేశాడట.
కాగా వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవర పార్ట్ 2 లో కూడా వీరి పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయి. అలాగే దేవర పార్ట్ 2లో దేవర కథ ఎక్కువుగా ఉంటుందట. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది.