లేటెస్ట్: “ఛావా” తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రముఖ బ్యానర్లో

లేటెస్ట్: “ఛావా” తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రముఖ బ్యానర్లో

Published on Feb 26, 2025 4:37 PM IST

ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి సెన్సేషనల్ రేపుతున్న భారీ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. వెర్సటైల్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి సింగిల్ భాషలోనే బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

అయితే ఈ చిత్రం కోసం తెలుగు ఆడియెన్స్ లో రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచి కూడా విపరీతమైన డిమాండ్ నెలకొంది. సోషల్ మీడియాలో కూడా చాలామంది ట్రెండ్ చేశారు. అయితే ఫైనల్ గా వారి అందరి ఆశలు నిజం అయ్యాయి. మన తెలుగు బడా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు.

అలాగే సాలిడ్ పోస్టర్ తో ఈ చిత్రాన్ని ఈ మార్చ్ 7న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం ఛావా గర్జన తెలుగులో కూడా ఇక వినిపించనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు