నాని “హిట్ 3” స్టైల్ లోనే “ప్యారడైజ్” ట్రీట్ కూడా

నాని “హిట్ 3” స్టైల్ లోనే “ప్యారడైజ్” ట్రీట్ కూడా

Published on Feb 26, 2025 3:02 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మరి నాని హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒక్కసారిగా సాలిడ్ హైప్ ని అందుకున్న చిత్రం “హిట్ 3”. తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం నుంచి వచ్చిన టీజర్ క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ తాను పరిచయం చేసిన మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో చేస్తున్న భారీ చిత్రం “ది ప్యారడైజ్” ట్రీట్ ని కూడా లాక్ చేశారు.

అయితే దీనిని హిట్ 3 ఫార్మాట్ లోనే అనౌన్స్ చేసారని చెప్పాలి. మేకర్స్ హిట్ 3 టీజర్ ని కాస్తా సర్కార్ లాఠీ అంటూ ప్రమోట్ చేయగా ఇపుడు ప్యారడైజ్ మేకర్స్ గ్లింప్స్ ని ఒక రా స్టేట్మెంట్ అంటూ పోస్ట్ చేశారు. దీనితో ఈ రానున్న స్టేట్మెంట్ కూడా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రం తాలూకా గ్లింప్స్ ఈ మార్చ్ 3న రాబోతుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు