“గేమ్ ఛేంజర్”లో మీమ్ గాడ్ సీన్స్ కూడా లేపేసారా?

“గేమ్ ఛేంజర్”లో మీమ్ గాడ్ సీన్స్ కూడా లేపేసారా?

Published on Feb 16, 2025 9:00 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోని సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలో జరిగిన చాలా లోపాలు ఒకొకటిగా బయటకి వచ్చాయి.

అయితే ఇందులో సినిమా రన్ టైం పై కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. శంకర్ ఏకంగా 5 గంటల ఫుటేజ్ చేశామని చెప్పుకొచ్చారు. కానీ సినిమాని 2 గంటల 40 నిమిషాలకే కుదించేశారు. దీనితో చాలా సీన్స్ లేపేసారని అర్ధం అయ్యింది. మరి ఈ సినిమాలో మీమ్ గాడ్ బ్రహ్మానందం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాను ఈ సినిమాలో కేవలం ఒక్క నిమిషం మేర మాత్రమే కనిపించారు.

మరి తన సీన్స్ కూడా సినిమాలో కట్ చేసేసారు అన్నట్టుగా పలు కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి బ్రహ్మానందం లాంటి దిగ్గజం కేవలం అంత తక్కువ సమయం కనిపించడం అభిమానులకి కొంచెం డిజప్పాయింట్ అనిపించింది కానీ బ్రహ్మానందం తన రోల్ పట్ల ఆనందంగానే ఉన్నట్టు తెలిపారు. తాను కనిపించింది కొంచెం సేపే అయినప్పటికీ ఐఏఎస్ పెద్ద పాత్ర చేసానని చెప్పుకొచ్చారు. దీనితో తన సీన్స్ ఏవి కట్ చేయలేదనే చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు