ఇళయరాజాకు సతీ వియోగం

ఇళయరాజాకు సతీ వియోగం

Published on Nov 1, 2011 11:59 AM IST

illayaraja1
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భార్య జీవ తీవ్రమైన గుండె పోటుతో గత రాత్రి కన్నుమూశారు. ఈ హఠాత్ మరణంతో ఇళయరాజా, కుటుంభ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు భార్య పద్మ మరణవార్త మరువక ముందే మరో దుర్వార్త వినాల్సి రావటం నిజంగా విచారకరం.

‘శ్రీరామ రాజ్యం’ సినిమా కు సంబంధించి ప్రెస్ మీట్ లో పాల్గొనేందుకు సోమవారం ఇళయరాజా హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, జీవాకు తీవ్ర గుండెపోటు రావటం తో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఆమె వయస్సు 60 సంవత్సరాలు. జీవాకు ఇళయరాజా, కుమారులు కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతా రాణి ఉన్నారు.

ఈ దుర్ఘటన పట్ల 123 తెలుగు.కాం విచారం వ్యక్తం చేస్తుంది. ఇళయరాజా, అతని కుటుంభ సభ్యులకూ ప్రగాడ సానుభూతిని తెలియచేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు