“వైల్డ్ డాగ్” ట్రైలర్ పై చిరు, మహేష్ ల రియాక్షన్ షేర్ చేసిన నాగ్.!

“వైల్డ్ డాగ్” ట్రైలర్ పై చిరు, మహేష్ ల రియాక్షన్ షేర్ చేసిన నాగ్.!

Published on Mar 12, 2021 4:05 PM IST

మన టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రం “వైల్డ్ డాగ్”. అషిహోర్ సాల్మోన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం పై ఎప్పటి నుంచో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ మెగాస్టార్ చిరంజీవితో ఈరోజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ట్రైలర్ ను విడుదల చెయ్యడానికి ముందు చిరు కి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుకి పంపగా వారి రియాక్షన్ ను నాగ్ షేర్ చేసుకున్నారు.

ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నాకు మరింత ఉత్సుకత పెంచుతుంది అని చిరు తెలిపారు. అలాగే మహేష్ చూసి ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉందని అనగా నాగ్ దీనిని స్క్రీన్ షాట్ తీసి షేర్ చెయ్యొచ్చా అని అడగ్గా తప్పకుండా అని నాగ్ కు వాట్సాప్ లో తెలిపారు. దీనితో నాగ్ ఈ ఇద్దరితో జరిపిన కన్వర్జేషన్ ను నాగ్ షేర్ చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో నాగ్ ఏసీపీ విజయ్ వర్మ గా కనిపించనుండగా దియా మీర్జా ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. అంతే కాకుండా “ఆచార్య” నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు