నిన్న మహా శివరాత్రి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. వాటిలో మిడ్ రేంజ్ సినిమాలే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూడిట్లో కూడా భారీ అంచనాలు మరియు సాలిడ్ ప్రమోషన్స్ నడుమ విడుదల కాబడిన చిత్రం “జాతి రత్నాలు”. నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ఆడియెన్స్ ను టార్గెట్ పెట్టుకొని రిలీజ్ అయ్యింది. అయితే మంచి హైప్ లో వచ్చిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా అనుకున్న స్థాయి ఓపెనింగ్సే దక్కాయి. అయితే ఈ లెక్కలను పీ ఆర్ టీం బయటకు వెల్లడించారు. మరి వాటిని ఏరియాల వారీగా పరిశీలించినట్టైతే..
నైజాం – 1.65 కోట్లు
సీడెడ్ – 51 లక్షలు
నెల్లూరు – 10.3 లక్షలు
కృష్ణ – 24.7 లక్షలు
గుంటూరు – 38.6 లక్షలు
వైజాగ్ – 46 లక్షలు
తూర్పు – 29.3 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం షేర్ – 3.64 కోట్లు
కర్ణాటక – 28 లక్షలు
తమిళనాడు – 5 లక్షలు
మిగతా దేశం అంతా – 6 లక్షలు
ఓవర్సీస్ – 90 లక్షలు
మొత్తం – 1.29కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం – 4.93 కోట్లు షేర్
ఇది సాలిడ్ వసూళ్లనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి మంచి ప్రమోషన్స్ సహా నిర్మాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించడం ఇవన్నీ కూడా ఈ చిత్రానికి సూపర్బ్ గా వర్కౌట్ అయ్యాయి. మరి ఈ వారాంతానికి ఇంకా మంచి వసూళ్లను ఈ చిత్రం కొల్లగొట్టడం ఖాయం అని చెప్పొచ్చు.