“వీరమల్లు”లో జాక్వెలిన్ రోల్ పై క్లారిటీ.!

“వీరమల్లు”లో జాక్వెలిన్ రోల్ పై క్లారిటీ.!

Published on Mar 12, 2021 1:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “హరి హర వీరమల్లు”. నిన్న విడుదల చేసిన పవన్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ టీజర్ ను చూసాక ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు వేరే స్థాయికి వెళ్లాయి.

అయితే ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో లేదో అన్న టాక్ ముందే వచ్చింది అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు కూడా వినిపించింది. అయితే హీరోయిన్ గా నిధి అగర్వాల్ పేరు ఫిక్స్ కావడంతో ఈమెకు వేరే కీలక అన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఇప్పుడు ఆమె కనిపించబోయే రోల్ పై క్లారిటీ వస్తుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ మొగలాయి చక్రవర్తి ఔరంగజేబు సోదరి పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు