చర్చల్లో మరొక ఆసక్తికరమైన బయోపిక్

చర్చల్లో మరొక ఆసక్తికరమైన బయోపిక్

Published on Mar 11, 2021 11:53 PM IST

biopic

టాలీవుడ్లో కొన్నేళ్లుగా బయోపిక్ సంస్కృతి ఊపందుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన ‘మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. అందుకే దర్శకులు ఆ తరహా కథల మీద దృష్టి సారిస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈమధ్య బాగా చర్చకు వస్తున్న ఓ విషయం ఆసక్తిని రేపుతోంది. అదే ప్రముఖ రాజకీయ నాయకుడు, అవినీతి మచ్చలేని వ్యక్తి, 5 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి దోపిడీ దౌర్జన్యాలకి పాల్పడకుండా కేవలం ప్రజాసేవకే తన జీవితం అంకితం చేసి సాదా సీదా జీవితం సాగిస్తున్న ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం.

దీని మీదే ఒక బయోపిక్ వస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో బలమైన టాక్ వినిపిస్తుంది. గత ఆరు నెలలుగా ఈ కథకి సంబంధించిన అధ్యయనం జరుగుతుందని, ఈ సినిమాని పరమేశ్వర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తాడని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ప్రజలతో పాటు ఈ తరం మరియు రాబోయే తరాల రాజకీయ నాయకులకు కూడా తెలిసే అవకాశం ఉంది.
ఈ బయోపిక్ గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు