“రాధే శ్యామ్” స్పెషల్ అప్డేట్ వచ్చిందిగా!

“రాధే శ్యామ్” స్పెషల్ అప్డేట్ వచ్చిందిగా!

Published on Mar 11, 2021 9:16 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి అప్పుడప్పుడు కొన్ని అప్డేట్స్ ను మేకర్స్ వదులుతూ వస్తున్నారు. గత నెల ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక గ్లింప్స్ ను వదిలారు దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఇక అక్కడ నుంచి ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై కాస్త హంగామా నడిచింది కానీ అది కూడా తేలిపోయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఓ స్పెషల్ అప్డేట్ కోసం బజ్ వినిపించింది. మరి దానిని నిజం చేస్తూ మేకర్స్ ఈ మహా శివరాత్రి స్పెషల్ గా ప్రభాస్ మరియు పూజాలపై ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. మంచులో ఇద్దరూ పడుకొని ఉన్న ఈ పోస్టర్ మంచి ప్లెసెంట్ గా అనిపిస్తుంది. ఇక ఈ భారీ చిత్రానికి మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం వచ్చే జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు