‘క్రాక్’ దర్శకుడితో బాలయ్య ?

‘క్రాక్’ దర్శకుడితో బాలయ్య ?

Published on Jan 12, 2021 11:13 PM IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. రవితేజ హీరోగా రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. లాక్ డౌన్ అనంతరం వచ్చిన పెద్ద ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా ఫలితం మీద దృష్టి పెట్టింది. పక్కా మాస్ ఎంటర్టైనర్ కావడంతో మాస్ ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు.

ప్రేక్షకులకు మళ్ళీ సినిమా హాళ్లను పరిచయం చేసిన ఘనతను దక్కించుకుంది ఈ చిత్రం. అందుకే డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి డిమాండ్ పెరిగింది. మాస్ మసాలా సినిమాలు చేయాలనుకునే హీరోలు ఈయనతో టచ్లోకి వెళుతున్నారట. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సైతం ఈయనతో సినిమా చేయాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. బాలయ్యకు మాస్ పల్స్ తెలిసిన దర్శకులతో పనిచేయడం అంటే బాగా ఇష్టం. అందుకే మలినేనితో ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆయన తన తర్వాతి సినిమా అవకాశాన్ని ‘క్రాక్’ దర్శకుడికే ఇస్తారేమో చూడాలి.

తాజా వార్తలు