మన టాలీవుడ్ లో ఉన్న కొన్ని ఆల్ టైం హిట్ జోడీలు ఉన్నాయి. అలాంటి వేటలో వెర్సిటైల్ నటులు భాను చందర్ మరియు సుహాసినీల జంటను అంత త్వరగా ఎవరు మర్చిపోరు. మరి అలాంటి వీరి జంట ఇన్నేళ్ల తర్వాత ఓ అద్భుతమైన సాంగ్ కు స్క్రీన్ ను పంచుకొని మెస్మరైజ్ చేశారు.
అది కూడా తెలుగు నాట అతి పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతిపై డిజైన్ చేసిన సాంగ్ లో. భోలే శవాళీ కాన్సెప్ట్ మరియు సంగీతం అలాగే డైరెక్షన్ చేసిన మకర సంక్రాంతి వీడియో సాంగ్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ ను కూడా తెచ్చుకొంది. ప్రముఖ సాహిత్య రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ మంచి క్యాచీ గా వినడానికి ఇంపుగా కూడా ఉంది.
ఇక వీటన్నిటికీ మించి ఈ సాంగ్ లో భాను చందర్ మరియు సుహాసినిలు ఎనర్జిటిక్ డాన్స్ ఈ సాంగ్ లో మరింత ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఈ సాంగ్ లో జనతా బాబు ఇచ్చిన డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ కూడా నీట్ గా ఉన్నాయి. గ్రీన్ మెట్రో ఇన్ఫ్రా టెక్ వారు నిర్మాణం వహించిన ఈ సాంగ్ కనుక మీరు మిస్సయితే చూసెయ్యండి.