నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమాలో తమిళ్ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేకపోయినా.. ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఇది నిజమే అని తెలుస్తోంది. కాగా నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా.. నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని.. ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా ఉండనుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాదే శ్యామ్’ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు