ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వస్తుందా.?

ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ వస్తుందా.?

Published on Jan 10, 2021 12:08 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు మన ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరో. ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు ఇప్పుడు నిర్మాతలకు పండగ అన్నట్టే..ఆ రేంజ్ లో తన మార్కెట్ ను విస్తరించుకున్న డార్లింగ్ బాహుబలి నుంచి ఇప్పుడు రాధే శ్యామ్ వరకు ఈ కొద్ది సినిమాల్లో భారీ గ్యాప్ ను తీసుకొంటున్నారు.

దీనితో అభిమానులకు అలా నిరీక్షణ తప్పడం లేదు. అలాగే వారికి ఓపిక కూడా బాగానే పెరిగిపోయింది. కానీ వాళ్ళని అలా ఉంచలేకే ఆ మధ్య ఒక సినిమాను మించి మరో సినిమాతో వరుస అప్డేట్స్ ఇచ్చి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసేసారు. మళ్ళీ అక్కడ నుంచి మామూలే..దీనితో ఓ సరైన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ తరుణంలో ప్రభాస్ నుంచి మరో సరికొత్త సాలిడ్ అప్డేట్ రానున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి అదేమిటో అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి అయితే మైండ్ బ్లోయింగ్ లైనప్ తో బిజీగా ఉన్న రెబల్ ఇక ఏ అప్డేట్ ను వదలనున్నాడో చూడాలి.

తాజా వార్తలు