మెగాస్టార్ నుంచి డబుల్ బొనాంజా ఉంటుందా..?

మెగాస్టార్ నుంచి డబుల్ బొనాంజా ఉంటుందా..?

Published on Jan 10, 2021 9:06 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే పవర్ ఫుల్ సబ్జెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇంకా లైన్ లోనే ఉన్నప్పుడు మరో రెండు రీమేక్ చిత్రాలను హోల్డ్ లో ఉంచేశారు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే వాటిలో ఒకటైన “లూసిఫర్” చిత్రం త్వరలోనే మొదలయ్యి పూర్తి కావడానికి రెడీ అవ్వనుంది. అయితే మరి ఈ లెక్కన మెగాస్టార్ నుంచి ఖచ్చితంగా డబుల్ బొనాంజా ఉంటుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ముందుగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆచార్య వేసవి కానుకగా వచ్చేయనుండగా..

తర్వాత మొదలు పెట్టనున్న లూసిఫర్ చిత్రం కూడా బహుశా ఇదే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి ప్రధాన క్యాస్టింగ్ ను కూడా ఇప్పటికీ ఆచీ తూచి తీసుకుంటున్నారు. మరి నిజంగానే మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి.

తాజా వార్తలు