“రాధే శ్యామ్” టీజర్ ఇలా ఉంటుందా..?

“రాధే శ్యామ్” టీజర్ ఇలా ఉంటుందా..?

Published on Jan 9, 2021 10:55 PM IST


ఇప్పుడు కొత్త సినిమాలతో పాటుగా రాబోయే మరిన్నీ సాలిడ్ చిత్రాల తాలూకా టీజర్స్ హవా కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే పలు ఆసక్తికర చిత్రాల టీజర్ లు రావడం కూడా మొదలయ్యాయి. కానీ మన టాలీవుడ్ నుంచే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్స్ విడుదల కావాల్సి ఉంది. మరి ఆ టీజర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన “రాధేశ్యామ్” టీజర్ కూడా ఒకటి.

దీని కోసం అభిమానులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే టీజర్ కు సంబంధించి ఓ ఆసక్తికర టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ టీజర్ ను మేకర్స్ చాలా తక్కువ నిడివిలోనే అంటే ఓ 30 సెకండ్స్ లో స్వీట్ అండ్ సింపుల్ గా తేల్చేస్తారట. ఇందులోనే ఈ సినిమా థీమ్ ను అమేజింగ్ గా చూపించనున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ టీజర్ కోసం మాత్రం చాలానే ఎదురు చూస్తున్నారు. మరి మేకర్స్ ఆ బిగ్ అనౌన్సమెంట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

తాజా వార్తలు