1019వ ప్రాణాన్ని కాపాడిన మహేష్

1019వ ప్రాణాన్ని కాపాడిన మహేష్

Published on Jan 8, 2021 6:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సేవా కార్యక్రమాన్ని యజ్ఞంలా చేస్తున్న సంగతి తెలిసిందే. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సహాయం అందిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఈ సాయం ఒకరిద్దరితో ఆగిపోలేదు వంద రెండు వందలు ఐదు వందల 1000 కూడ దాటిపోయి 1019కు చేరుకుంది. అంటే ఇప్పటి వరకు మహేష్ 1019 చిన్ని గుండెలకు అండగా నిలబడ్డారు. ఈ విషయాన్నే నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె సర్జరీ చేయించుకున్న చిన్నారి క్షేమంగా ఉందని అన్నారు.

ఆంధ్రా హాస్పిటల్స్ వారితో కలిసి మహేష్ ఈ గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మొదట చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అవసరం అయితే మహేష్ సొంత ఖర్చులతో సర్జరీలు చేస్తున్నారు. మహేష్ ఉదారతకు,ఔన్నత్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం పొందిన పిల్లల తల్లిదండ్రులు మహేష్ బాబు తమకు దైవంతో సమానమని చేతులెత్తి మొక్కుతున్నారు. చిటికెడంత సహాయం చేసి కొండంత ప్రచారం కల్పించుకునే ఈరోజుల్లో మూడవ కంటికి తెలియకుండా ఇంత గొప్ప సహాయం చేస్తున్న మహేష్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో కదా.

తాజా వార్తలు