“వకీల్ సాబ్” లో పవన్ లుక్స్ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.!

“వకీల్ సాబ్” లో పవన్ లుక్స్ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Jan 2, 2021 6:03 PM IST

లేటెస్ట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న “వకీల్ సాబ్” షూట్ ను ముగించుకున్న సంగతి తెలిసిందే. మరి ఇది తన కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా సెట్టయ్యాయి. అయితే ఈ చిత్రంలో పవన్ మొత్తం మూడు లుక్స్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.

అది ఆ మధ్య మంచి వైరల్ కూడా అయ్యింది. ఇప్పుడు ఈ లుక్స్ కు సంబంధించే మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. పవన్ ఇందులో క్లీన్ షేవ్డ్ మరియు గడ్డంతో, ట్రిమ్డ్ లుక్ లో కనిపించనున్నారు. మరి ఈ మూడిట్లో ఏదేది ఎప్పుడు కనిపిస్తుందో అన్నది కూడా తెలుస్తుంది.

మొదటగా గడ్డం లుక్ లో ఫస్ట్ హాఫ్ లో సెకండాఫ్ లో ట్రిమ్డ్ లుక్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో క్లీన్ షేవ్డ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు