బహుశా ఇది సూర్య సినిమాకే చెల్లింది ఏమో..!

బహుశా ఇది సూర్య సినిమాకే చెల్లింది ఏమో..!

Published on Jan 1, 2021 1:02 PM IST

ఈ ఏడాది ఎలా ఉండనుందో కానీ గత ఏడాది మాత్రం ఏ ఒక్కరూ మర్చిపోలేని విధంగా ఉన్నది. మరి 2020లోనే ఎన్నో పరిణామాల రీత్యా అనేక సినిమాలు ఓటిటి బాట పట్టాయి. మరి అలా వచ్చిన వాటిలో కూడా భారీ హిట్ గా నిలిచినవి కొన్ని ఉన్నాయి. ఆ లిస్ట్ లో మాత్రం ఖచ్చితంగా విలక్షణ నటుడు సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” టాప్ లో నిలుస్తుంది.

సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఒక్క ఓటిటిలో విడుదల అయ్యింది అన్న వెలితి తప్ప వెండితెర పై మిస్సయ్యామని ఇప్పటికీ చాలా మంది బాధపడతారు. మరి ఆ రేంజ్ లో హిట్టయ్యింది కాబట్టే ఈ చిత్రానికి ఇప్పుడు 50 రోజుల పోస్టర్ ను విడుదల చేసారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడిన ఈ చిత్రం ఇప్పటికీ టాప్ లో కొనసాగుతుందట.

దీనితో 50 రోజుల పోస్టర్ ను విడుదల చెయ్యడం విశేషం. తమిళ్ మరియు తెలుగులో బిగ్గెస్ట్ ఓటిటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రంతోనే బహుశా ఇలాంటి పోస్టర్ ను విడుదల విడుదల చెయ్యడం జరిగింది. మామూలుగా అంటే థియేటర్స్ లో సినిమా విడుదల అయ్యి 50 రోజులు కంప్లీట్ అయితే మనం ఇలాంటివి చూస్తాము కానీ ఓటిటిలో ఓ సినిమాకు ఇలా చెయ్యడం సూర్య సినిమాకే చెల్లింది అనుకోవచ్చు.

తాజా వార్తలు