మోస్ట్ అవైటెడ్ సిరీస్ “ఫ్యామిలీ మ్యాన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?

మోస్ట్ అవైటెడ్ సిరీస్ “ఫ్యామిలీ మ్యాన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Dec 30, 2020 3:04 PM IST

ఇప్పుడు మన దగ్గర కూడా స్ట్రీమింగ్ కంటెంట్ కు మంచి డిమాండ్ ఏర్పడిపోయింది. లాక్ డౌన్ లో సరికొత్త కంటెంట్ ఏది లేకపోవడంతో జనం అంతా వీటిపై పడ్డారు దీనితో ఇవి మరింత మందికి చేరువయ్యాయి. ఇక వాటిలో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మన తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా మందికే తెలుసు.అలాగే ఇందులో కొన్ని సెన్సేషనల్ హిట్ వెబ్ సిరీస్ ల కోసం కూడా తెలిసిందే.

మరి వాటిలో ఇన్నాళ్లు “మీర్జాపూర్ 2” కోసం ఎంతగానో ఎదురు చూసిన జనం ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ అదిరిపోయే రెస్పాన్స్ ను ఓవరాల్ గా తెచ్చుకుంది. మరి దీని సీక్వెల్ ను దర్శకులు రాజ్ అండ్ డీకే లు మరింత సాలిడ్ గా తెరక్కెక్కించారు.

అలాగే ఇందులో స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ ఆసక్తికర వెబ్ సిరీస్ ను వచ్చే ఫిబ్రవరి 15 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రైమ్ వీడియో వారు ఈ సిరీస్ ను ఏకకాలంలో తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు