లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో సాలిడ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ “సలార్” అనే పవర్ ప్యాకెడ్ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేసాడు. దీనితో ఒక్కసారిగా భారీ హైప్ ఏర్పడిపోయింది. అయితే ఆరోజునే ప్రభాస్ లుక్ ను కూడా రివీల్ చెయ్యడంతో అది కూడా మంచి హాట్ టాపిక్ గా నిలిచింది.
మరి కొన్ని రోజుల్లో షూట్ స్టార్ట్ కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడు అన్న దానిపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాలో లుక్ కోసం ప్రభాస్ అప్పుడే జిమ్ కసరత్తులు కూడా మొదలు పెట్టేసాడని తెలుస్తుంది. తన రోల్ కు తగ్గట్టుగా ఈ చిత్రానికి కాస్త వెయిట్ పెరిగి సాలిడ్ పర్సనాలిటీతో కనిపించనున్నాడట.
మేకర్స్ చెప్పినట్టుగానే ఓ మోస్ట్ వైలెంట్ మెన్ గా ప్రభాస్ లో సరికొత్త కోణం ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. వచ్చే జనవరిలో షూట్ స్టార్ట్ కానున్న ఈ భారీ చిత్రాన్ని నాలుగు నెలల్లోపే కంప్లీట్ చెయ్యాలని ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబేలె వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.