విజయ్ “మాస్టర్” రన్ టైం అంతా..?

విజయ్ “మాస్టర్” రన్ టైం అంతా..?

Published on Dec 29, 2020 9:00 AM IST

ఇప్పుడు రానున్న రోజుల్లో బిగ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది ఇళయ థలపతి విజయ్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం “మాస్టర్” అని చెప్పాలి. వచ్చే సంక్రాంతికి మొత్తం పాన్ ఇండియన్ వైడ్ రిలీజ్ కు ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు నిడివి ఎంత ఉంటుంది అన్నది బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని ఏకంగా 178 నిమిషాలకు కట్ చేసారట. అంటే సుమారు మూడు గంటల దగ్గరకే..రెండు గంటల 58 నిమిషాలు రన్ టైం ఈ చిత్రం వచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకు ముందు కూడా విజయ్ సినిమాలకు దాదాపు ఇలాంటి రన్ టైమే వచ్చాయి. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు