ఏ.ఆర్.రెహమాన్ ఇంట తీవ్ర విషాదం

ఏ.ఆర్.రెహమాన్ ఇంట తీవ్ర విషాదం

Published on Dec 28, 2020 4:49 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం కొద్ది సేపటి క్రితం చెన్నైలోని నివాసంలో కన్నుమూశారు. దీంతో రెహమాన్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వయసురీత్యా ఎదురైనా ఆరోగ్య సమస్యల మూలంగానే కరీమా బేగం కన్నుమూసినట్టు తెలుస్తోంది.

రెహమాన్ కొద్దిసేపటి క్రితమే తన తల్లి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. రెహ‌మాన్‌కు తొమ్మిది నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు ఆయ‌న తండ్రి మ‌ర‌ణించగా తల్లి కరీమా బేగమే అన్నీ అయి పెంచారు. మధ్యతరగతి కుటుంబమైనప్పటికీ సంగీతం మీద రెహ‌మాన్‌కు ఉన్న ఆసక్తిని గమనించి ఆర్ధిక సమస్యలను కూడ లెక్కచేయకుండా ప్రోత్సహించారామె. రెహమాన్ సైతం తన తల్లి కష్టం, ఆశీర్వాదాలతోనే ఇంత గొప్ప స్థాయికి చేరుకోగలిగానని తరచూ చెప్పేవారు. కరీమా బేగం మృతి పట్ల అన్ని భాషల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ రెహ‌మాన్‌కు సానుభూతిని తెలుపుతున్నారు.

తాజా వార్తలు