“వకీల్ సాబ్” కు డేట్ అప్పటికి ఫిక్సయ్యిందా.?

“వకీల్ సాబ్” కు డేట్ అప్పటికి ఫిక్సయ్యిందా.?

Published on Dec 28, 2020 12:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హసాన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఏడాది వేసవి రేస్ లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ వల్ల పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా పడాల్సి వచ్చింది.

అలా ఫైనల్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది వేసవిలో నిలపాలని సన్నాహాలు చేస్తున్న టాక్ వస్తుంది. అయితే మరి అందుకు ఓ డేట్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్ మీడియా వర్గాల్లో విరివిగా ప్రచారం జరుగుతుంది.ఏప్రిల్ నెలలో ఈ చిత్రానికి డేట్ అనుకుంటున్నారని కొన్ని రోజుల కితమే టాక్ వచ్చింది.

ఇప్పుడు అలానే ఏప్రిల్ 9 అన్నట్టుగా టాక్ సంతరించుకుంది. మరి ఇది ఎంత వరకు నిజమో కాలమే నిర్ణయించాలి. ఈ చిత్రంలో అంజలి, నేవేతా థామస్ లు కీలక పాత్రలు పోషించగా థమన్ సంగీతం అందించారు. అలాగే పవన్ కం బ్యాక్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు