అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా ఫస్ట్ కాపీ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాని నాగార్జున చూశారని, సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట. అయితే సినిమాలో లవ్ ట్రాక్ ఎక్కవైందని.. కాకపోతే లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందట. కానీ, లవ్ ట్రాక్ ను కొంచెం ట్రీమ్ చేస్తే సినిమా ఇంకా బాగుంటుదని మేకర్స్ పీల్ అవుతున్నారట
కాగా అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ సైతం అఖిల్ ఈ చిత్రంతోనైనా సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు. మరి అఖిల్ కి ఎలాంటి హిట్ వస్తోందో చూడాలి.