వైరల్ అవుతోన్న సీనియర్ ఎన్టీఆర్ ఫోటో !

వైరల్ అవుతోన్న సీనియర్ ఎన్టీఆర్ ఫోటో !

Published on Dec 27, 2020 7:00 PM IST

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితంలో గొప్ప సినిమాగా నిలిచిన సినిమా ‘పాతాళ భైరవి’. 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఈ జానపద చిత్రానికి సంబంధించిన ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు మొత్తానికి ఈ సినిమాని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.

అందుకే ఇప్పటికీ ఈ సినిమాకి సంబధించిన పోస్టర్ వైరల్ అవుతుంది. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది. మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కథలులోని ఒక కథ, అల్లాఉద్దీన్ అద్భుత దీప కథ, బాల నాగమ్మ మొదలైన ప్రజాదరణ పొందిన కథల ఆధారంగా ఈ సినిమాకి కథను అల్లుకున్నారు. ఈ సినిమాలో సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా, మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా, లాంటి డైలాగ్ లు బఫర్ ఫేమస్ అయ్యాయి.

తాజా వార్తలు