‘పుష్ప’ స్మగ్లింగ్ కోసం అరకు ప్రాంతానికి.. !

‘పుష్ప’ స్మగ్లింగ్ కోసం అరకు ప్రాంతానికి.. !

Published on Dec 27, 2020 2:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’ షూటింగ్ దశలో ఉంది. కాగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించనున్నారు. అయితే ఈ సినిమాలో స్మగ్లింగ్ సీన్స్ హైలైట్ గా ఉంటాయట. అందుకే ఆ సీన్స్ షూటింగ్ ను సుకుమార్ ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. వచ్చే షెడ్యూల్ లో అరకు ప్రాంతంలోని అటవి ప్రాంతంలో ఈ సీన్స్ ను తీయడానికి ప్రస్తుతం సుక్కు తన టీమ్ లోని ఒకతన్ని లొకేషన్స్ కోసం అరకు ప్రాంతానికి పంపారు .

ఆ విధంగా అరకులో స్మగ్లింగ్ సీన్స్ తీయనున్నారు. ఇక వచ్చే షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఫైనల్ చేసింది చిత్రబృందం. అలాగే ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కోసం మంచి హీరోను వెతుకుతుంది టీమ్. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు