టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాకుండా మూడు దశాబ్దాల ఏక ఛత్రాధిపత్యంలో అత్యధిక ఆల్ టైం రికార్డు సినిమాలు కలిగిన హీరోగా మెగాస్టార్ నిలిచారు.
అయితే అలా తాను నటించిన భారీ హిట్ చిత్రాల్లో ఏయే సినిమాలు ఎవరు చేస్తే బాగుంటుందో “ఆహా” స్ట్రీమింగ్ వారు స్టార్ హీరోయిన్ సమంతా తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ సెలెబ్రెటీ టాక్ షో “సామ్ జామ్”లో తెలిపారు.
ఇందులో తాను చేసిన చేసిన ఆల్ టైం పవర్ యాక్షన్ చిత్రం “ఇంద్ర”కు రెబల్ స్టార్ ప్రభాస్ పేరును ఎంచుకున్నారు. ఆ సినిమాకు ప్రభాస్ అయితేనే సెట్టవుతాడు అని చిరు చూస్ చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ తన “ఆచార్య” సినిమాలో బిజీగా ఉండగా ప్రభాస్ తన పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.