“మెరిసే మెరిసే” చిత్రం నుండి ‘నిన్నే నేనిలా’ లిరికల్ సాంగ్ విడుదల !!

“మెరిసే మెరిసే” చిత్రం నుండి ‘నిన్నే నేనిలా’ లిరికల్ సాంగ్ విడుదల !!

Published on Dec 26, 2020 1:00 PM IST

దినేష్ తేజ్ హీరోగా శ్వేతా అవస్తి హీరోయిన్ గా కొత్తూరి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న చిత్రం “మెరిసే మెరిసే”. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. .. ఇటీవలే రిలీజ్ అయిన ‘కనులతో రచించు’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇప్పుడు కృష్ణవేణి రచించిన ‘నిన్నే నేనిలా’ రెండవ లిరికల్ వీడియో పాటని డిసెంబర్ 24న రేడియో సిటీలో విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మెరిసే మెరిసే చిత్రం ఆడియో మార్కెట్లో కి విడుదలైంది.. కార్తీక్ కొడగండ్ల వండర్ ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు..

చిత్ర నిర్మాత వెంకటేష్ కొత్తూరి మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ విష్ణు గారు రిలీజ్ చేసిన కనులతో రచించు పాట అందరినీ అలరిస్తుంది. ఇప్పుడు నిన్నే నేనిలా పాట కూడా అందరికీ నచ్చుతుంది. సరికొత్త పాయింట్ తో అందమైన రొమాంటిక్ ప్రేమకథతో పవన్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.. అతి త్వరలో మెరిసే మెరిసే చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం… అన్నారు.

తాజా వార్తలు