మంచు మనోజ్ వెండి తెర మీద కనబడి చాన్నాళ్ళే అవుతోంది. చివరగా ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన మనోజ్ ఆ తర్వాత ఉన్నట్టుండి బ్రేక్ తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలోని సమస్యల కారణంగా బాగా డిస్టర్బ్ అయిన ఆయన ఈ మూడేళ్లు అన్నిటికీ దూరంగా గడిపారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మినహా బయట వేడుకల్లో కూడ పెద్దగా కనిపించలేదు. అయితే ఆ టైంలో మనోజ్ కెర్రీ మీద, ఆరోగ్యం మీద బాగానే దృష్టి పెట్టారు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాకి చాలా బరువు ఉన్న ఆయన ఇప్పుడు స్లిమ్ లుక్ తెచ్చేసుకున్నారు.
ఈ లుక్ కోసం ఆయన 15 కిలోల బరువు తగ్గారు. ఈరోజు క్రిస్మస్ సందర్బంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ తన ఫోటోలను రివీల్ చేశారు మనోజ్. ఆయన ఒక్కసారి అంత సన్నగా కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. తక్కువ వ్యవధిలో ఇంత బరువు తగ్గడం అంటే సాహసమే అంటున్నారు. అంతేకాదు ఇక మీదట ఆయన సినిమాలు కూడ వేగం పుంజుకోనున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన సైన్ చేసిన ‘అహం బ్రహ్మసి’
చిత్రం మేకింగ్ దశలో ఉంది. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. ఇది కాకుండా ఇంకో రెండు సినిమాలకు సైన్ చేశారట ఆయన. ఆ రెండు కూడ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాలు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.