పవన్ క్రేజీ ప్రాజెక్ట్ ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నాం అంటున్న దర్శకుడు!

పవన్ క్రేజీ ప్రాజెక్ట్ ను సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నాం అంటున్న దర్శకుడు!

Published on Nov 15, 2020 7:00 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” అనే చిత్రంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగానే పవన్ మరిన్ని సినిమాలు లైన్ లో పెట్టేసి మరింత ఆశ్చర్య పరిచారు. అయితే లేటెస్ట్ గా మాత్రం ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను ఓకే చెయ్యడంతో మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే మళయాళ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమా పట్ల దర్శకుడు మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఇటీవలే ఇచ్చిన ఓ చిన్న టాక్ లో మాట్లాడుతూ తాను కూడా ఒక పవన్ అభిమానిగా చాలా ఎదురు చూస్తున్నానని అలాగే మన నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేశామని అలాగే సినిమాలో ఉండే ఇంపార్టెంట్ రోల్స్ ను కూడా బాగా డిజైన్ చేశామని తెలిపారు. అలాగే అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాలిడ్ తెరకెక్కిస్తామని ఈ దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు