ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం “మాస్టర్”. టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మామూలుగానే విజయ్ సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
ఇక అదే సమయంలో మోస్ట్ అవైటెడ్ గా మారిన టీజర్ ను నిన్న దీపావళి కానుకగా విడుదల చెయ్యగా భారీ స్థాయి రికార్డులను నెలకొల్పుతుంది. అది కూడా కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా లైక్స్ పరంగా కూడా సెన్సేషనల్ రికార్డులను థలపతి ఫ్యాన్స్ సెట్ చేస్తున్నారు.
ఇంకా 24 గంటలు పూర్తి కాకముందే 1.6 మిలియన్ ఆల్ టైం రికార్డ్ లైక్స్ అలాగే 15 మిలియన్ దగ్గరగా వ్యూస్ ను కొల్లగొట్టి మన దక్షిణాదిలోనే భారీ రికార్డులను నెలకొల్పింది. మొత్తానికి మాత్రం మాస్టర్ బ్లాస్ట్ మాములుగా పేలలేదు అని చెప్పాలి. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందివ్వగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపిస్తున్నారు. అలాగే మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.