సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. కానగరాజ్ గత చిత్రమ్ ‘ఖైదీ’ సూపర్ హిట్ కావడం, స్టార్ హీరో విజయ్ హీరోగా ఆయన చేసిన ‘మాస్టర్’ విడుదలకు సిద్ధం కానునటంతో కమల్ సినిమాపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన చిన్నపాటి టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది.
అదేమిటంటే ఈ సినిమాను ఎక్కువ భాగం నైట్ ఎఫెక్ట్ లోనే షూట్ చేయనున్నారట. కనగరాజ్ తన గత చిత్రాలు ‘మానగరం, ఖైదీ’లను కూడ ఎక్కువగా రాత్రి సమయంలోనే చిత్రీకరించారు. ఆ రెండూ మంచి హిట్లుగా నిలిచాయి. అందుకే ఈ సినిమాను కూడ నైట్ ఎఫెక్ట్ లోనే షూట్ చేయనున్నారట. కథ కూడ ఎక్కువ భాగం రాత్రి సమయంలోనే జరిగేలా రాసుకున్నారట. అంటే ఇకపై కమల్ హాసన్ పని మొత్తం రాత్రిపూటే ఉండనుంది. డిసెంబర్ మొదటి వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. కమల్ హాసన్ సొంత బ్యానర్లో నిర్మితంకానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.