మొత్తానికి నయా ఎనర్జీ ఇచ్చిన మెగాస్టార్.!

మొత్తానికి నయా ఎనర్జీ ఇచ్చిన మెగాస్టార్.!

Published on Nov 13, 2020 7:04 AM IST

ప్రపంచాన్ని వణికించిన కరోన సినీ ఇండస్ట్రీలో కూడా తీరని నష్టాన్ని మిగిల్చింది. అయితే ఇటీవలే టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కి కూడా కరోనా పాజిటివ్ అని వార్త ప్రకటించడం తో సినీ ప్రపంచం అంతా స్పందించి ఏం కాకూడదని కోరుకున్నారు. కానీ లేటెస్ట్ గా తనకి మళ్లీ టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది అని తనదైన స్టైల్ లోనే అందరికీ చెప్పి బాస్ స్టైల్ వేరే అనిపించుకున్నారు.

దీనితో మెగా ఫాన్స్ కు కూడా నయా ఎనర్జీ వచ్చినట్టు అయ్యింది. ఎందుకంటే చిరు మరియు కొరటాల శివ కాంబోలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య” షూట్ చాలా కాలం తర్వాత మొదలు పెట్టి ఆగిపోవడం నిరాశ కలిగించింది. కానీ ఇప్పుడు చిరు కి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తొందరలోనే షూట్ మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా మళ్లీ వచ్చినట్టు అయ్యింది. మరి మెగాస్టార్ ఎప్పుడు రంగంలో దిగుతారో చూడాలి.

తాజా వార్తలు