సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న కొత్త చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్రం ఇప్పటికీ రీస్టార్ట్ కాలేదు. అన్ని సినిమాలు మెల్లగా మొదలవుతున్నా ఈ చిత్రం మాత్రం ముందుకు కదలట్లేదు. 69 ఏళ్ళ రజినీకాంత్ వైద్యుల సలహా మేరకు ఇంటికే పరిమితం కావడమే ఇందుకు కారణం. గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో రజినీ కోవిడ్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు బయటకు రాకూడదని డిసైడ్ అయ్యారు. చివరికి అతి ముఖ్యమైన తన పొలిటికల్ ఎంట్రీని కూడ వాయిదా వేసుకున్నారు.
చూడబోతే ఇంకో రెండు మూడు నెలల వరకు ఈ సినిమా మొదలయ్యేలా లేదు. ఒకవేళ ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో షూటింగ్ రీస్టార్ట్ అయితే వేసవికి విడుదలను ఆశించవచ్చు. మరి అదైనా కుదురుతుందో లేదో చూడాలి. కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు జా కీ ష్రాఫ్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.