“వకీల్ సాబ్” రెండు రాకలపై లేటెస్ట్ గాసిప్స్ నిజమేనా?

“వకీల్ సాబ్” రెండు రాకలపై లేటెస్ట్ గాసిప్స్ నిజమేనా?

Published on Nov 12, 2020 11:03 PM IST

ఒకప్పుడు తమ అభిమాన హీరో సినిమా విడుదల కోసం కాకపోయినా ఆ సినిమాకు సంబంధించి అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వారు తర్వాత ఆ స్థానంలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ “RRR” కోసం వచ్చారు. ఇప్పుడు వారి స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు భర్తీ చేస్తున్నారని చెప్పాలి.

ఈ రెండు నెలలు అయ్యిపోతే పవన్ నుంచి ఓ సినిమా పడి మూడేళ్లు అయ్యిపోయినట్టే. కానీ ఇంకా సినిమా లేదు కనీసం టీజర్ కూడా లేదు. దీనితో వారి పడిగాపులు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ చిత్ర యూనిట్ నుంచి టీజర్ పరంగా ఎలాంటి సమాచారమూ లేదు దీనితో దానిపై వారు ఆశలు వదిలేసుకున్నారు. కానీ దీపావళికి వకీల్ సాబ్ రాక ఉందని ఆ సంకేతాలు ఉన్నాయని టాక్ రావడంతో ఓకే అనుకున్నారు.

కానీ మళ్ళీ షరా మామూలే అయ్యింది. ఇప్పుడు వకీల్ సాబ్ టీజర్ విషయంలోనే కాకుండా విడుదల విషయంలో కూడా సందేహాలు లేవనెత్తుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల అవుతుందని కూడా ఎలాంటి అధికారిక సమాచారమూ లేదని తెలిసిందే. దీనితో ఈ చిత్రం సమ్మర్ రేస్ కు షిఫ్ట్ అయ్యిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఇలా వకీల్ సాబ్ రాక రెండు రకాలుగా నిలిచింది అని చెప్పాలి. అలాగే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే మేకర్స్ నుంచి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు