చిరుకి కరోనా సోకలేదట.. కన్ఫ్యూజన్ అంతా అక్కడే జరిగింది

చిరుకి కరోనా సోకలేదట.. కన్ఫ్యూజన్ అంతా అక్కడే జరిగింది

Published on Nov 12, 2020 10:09 PM IST

మెగాస్టార్ చిరంజీవికి గత ఆదివారం కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సినీ, అభిమాన లోకం ఉలిక్కిపడింది. ఏడు నెలలు ఎంతో జాగ్రత్తగా ఉన్న చిరు షూటింగ్ రీస్టార్ట్ చేద్దామనుకునే సమయానికి ఆయనకు కరోనా అని రిపొర్ట్స్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. అభిమానులు చిరుకి ఏమీ కాకూడదని పూజలు చేశారు. ఒకానొక సందర్బంలో జాగ్రత్తగా ఉండాల్సింది కదా అంటూ విమర్శలు కూడ వచ్చాయి. కానీ అసలు చిరుకి కరోనానే సోకలేదని తేలింది.

పాజిటివ్ రిపొర్ట్స్ వచ్చిన రెండు రోజులకు కూడ లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన చిరు అపోలో ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయించుకున్నారు. అందులో ఆయన ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ ట్రేసెస్ ఏవీ కనబడలేదు. అక్కకడితో ఆగని చిరు ఎందుకైనా మంచిదని మరొక ల్యాబ్ నందు మూడు రకాల కిట్స్ ద్వారా పరీక్షలు చేయించుకోగా మూడింటిలోనూ నెగెటివ్ రిపొర్ట్స్ వచ్చాయి. చివరగా తనకు ఎక్కడైతే పాజిటవ్ రిపోర్ట్ వచ్చిందో అక్కడికే వెళ్లి ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నారు.

అందులోనూ నెగెటివ్ అనే తేలింది. దీంతో మొదట వచ్చిన పాజిటివ్ రిపోర్ట్ ఫాల్టీ కిట్ మూలంగా జరిగిన పొరపాటని తేల్చారు వైద్యులు. అంటే చిరుకు అసలు కరోనానే సోకలేదని నిర్థారణ అయింది. ఈ విషయాన్ని చిరు స్వయంగా తెలుపుతూ తన కోసం ఎంతో మధనపడిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు తెలిపారు. చిరుకు అసలు కరోనా సోకలేదని తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజా వార్తలు