సమయం అవుతున్నా అప్డేట్ ఊసేది..?

సమయం అవుతున్నా అప్డేట్ ఊసేది..?

Published on Nov 12, 2020 7:08 AM IST

మాములుగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే పండుగలు వస్తున్నాయి అంటే కొత్త సినిమాల అప్డేట్ల ప్రవాహం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈసారి వస్తున్న దీపావళి పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో నటిస్తున్న తాజా చిత్రం”వకీల్ సాబ్”.

ఈ సినిమా టీజర్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈ దీపావళి కి వస్తుంది అని స్ట్రాంగ్ బజ్ వినిపించింది. కానీ చిత్ర యూనిట్ నుంచి కానీ నిర్మాణ సంస్థ నుంచి కానీ సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎలాంటి చలనం కనిపించడం లేదు. దీనితో టైమ్ అయ్యిపోతున్నా మేకర్స్ ఎందుకు స్పందించడం లేదు అని పవన్ అభిమానులు నిర్మాత దిల్ రాజుకు మొర పెట్టుకుంటున్నారు.

మరి దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఈ మధ్యన ఏమన్నా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు