ఓటీటీల మీద కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఓటీటీల మీద కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Published on Nov 11, 2020 9:06 PM IST

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్ లైన్ కంటెంట్ హవా బాగా పెరిగింది. వార్తల నుండి సినిమాల వరకు అన్నీ ఆన్ లైన్ ద్వారానే పొందుతున్నారు జనం. లాక్ డౌన్ ఎఫెక్ట్ మూలంగా ఆన్ లైన్ కంటెంట్ వినియోగం, రూపకల్పన బాగా ఎక్కువైంది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వినియోగం ఊపందుకుంది. ఇక యూట్యూబ్, న్యూస్ వెబ్ సైట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త ఛానెల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ కంటెంట్ మీద నియంత్రణ ఉండాలనే నిర్ణయం తీసుకుంది.

ఆన్ లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి అన్ని కంటెంట్ ప్రొవైడర్స్ ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ కిందకు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీలను నియమించాలన్న పిటిషన్ మీద విచారణ జరిపిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఇంతవరకు డిజిటల్ కంటెంట్ మీద ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో వాటి మీద కూడ నియంత్రణ అవసరమని భావించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాను, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోషియేషన్ ఎలక్ట్రానిక్ మీడియాను, సీబీఎఫ్‌సీ సినిమాలను పర్యవేక్షించేవి. అలాగే డిజిటల్ కంటెంట్ ‌ను కేంద్రమే నేరుగా పర్యవేక్షించనుంది.

తాజా వార్తలు