ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చ్ఛిత్రానికి ఇప్పటికే కరోనా వల్ల పెద్ద బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. సరే ఇక అన్ని సినిమాలు షూటింగ్ మొదలు పెడుతున్నారు. ఈ చిత్రం కూడా మొదలు కానుంది అన్న సమయంలో మెగాస్టార్ చిరుకు కరోనా పాజిటివ్ అనే వార్త షాకింగ్ గా మారింది.
దీనితో చిరు కోలుకోవాలని అభిమానులు సహా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతగానో ప్రార్థిస్తున్నారు. అయితే మరోపక్క మాత్రం ఇప్పటికే చాలా లేట్ కాబడిన ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆన్ టైం లో పూర్తి చేసెయ్యాలని కొరటాల స్ట్రాంగ్ గా ఫిక్సయ్యారని చెప్పాలి. అందుకే ముందు చెప్పినట్టుగానే చిరు లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలతో షూట్ ను ఈరోజు ప్రారంభించేసారు.
అయితే చిరుకు జస్ట్ కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది తప్ప ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని చెప్పడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. కావున కొరటాల ఎక్కడా తగ్గకుండా వచ్చే ఏడాది వేసవి రేస్ లో ఈ చిత్రాన్ని నిలిపేయాలి అన్నది పరమావధిగా పెట్టుకున్నట్టు చెప్పొచ్చు. ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.